Pooja Hegde | సినిమాల్లో చూసేటప్పుడు కలర్ఫుల్గా, ఎంటర్టైనింగ్గా కనిపించే పాటల వెనుక అసలు కథ వేరే ఉంటుంది. ఆ డ్యాన్స్ లు, కాస్ట్యూమ్స్, విజువల్స్ క్రియేట్ చేయడానికి ఆర్టిస్టులు పడే కష్టం గురించి తక్కువమంది మాత్రమే ఆలోచిస్తారు. అలాంటి ఒక అద్భుతమైన పాటగా తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలోని స్పెషల్ సాంగ్ “మోనికా బెల్లూచి” నిలిచింది. ఈ పాటలో పూజా హెగ్డే మెరిసిపోతుండగా, ఆమెకు జతగా సౌబిన్ షాహిర్ కూడా స్టెప్పులు వేసినారు. ఇప్పటికే పాటకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.ఈ పాటకు వస్తున్న విశేష స్పందనపై పూజా హెగ్డే తన సోషల్ మీడియా ఖాతాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టింది.
ఈ పాట తన కెరీర్లో ఫిజికల్‌గా చాలా కష్టపడ్డ పాట అని చెప్పిన పూజా, కాలు బెణికిన తర్వాత చేసిన ఫస్ట్ సాంగ్ ఇదే అని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండ, వేడి, దుమ్ము మధ్య ఈ పాటను షూట్ చేయాల్సి వచ్చిందని, అయినా ఆ కష్టాలు ప్రేక్షకులకు కనిపించకుండా గ్లామర్‌ను మాత్రమే పంచేందుకు తాను తన శక్తిమేర కృషి చేసినట్టు తెలిపారు. ఈ పాటను శివరాత్రి రోజున షూట్ చేసినట్టు పేర్కొంది. ఆ రోజు తాను ఉపవాసంగా ఉన్నప్పటికీ ఎటువంటి వెనుకడుగు వేయకుండా పూర్తి డెడికేషన్‌తో పని చేసినట్లు పూజా తెలిపారు. “ఈ పాటకు నా బెస్ట్ ఇచ్చాను… థియేటర్లలో ఈ పాట వస్తే అందరూ స్టెప్పులు వేస్తారు! అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.
పూజా హెగ్డే నటన, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు పాటకి ఉన్న బీట్స్ ఈ పాటను మాస్ సాంగ్‌గా మార్చాయి. యువత మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో కూడా ఈ పాటకు క్రేజ్ పెరుగుతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల కాబోతుంది.ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు ఉపేంద్ర, నాగార్జున, ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ‘మోనికా బెల్లూచి’ సాంగ్ హైప్ సినిమాకు మరింత బజ్ తెచ్చింది.