Pooja Hegde | టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే సోదరుడు రిషభ్ హెగ్డే ఓ ఇంటివాడయ్యాడు. శివానీ శెట్టిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని పూజాహెగ్డే సోషల్ మీడియా ద్వారా అభిమానుతో షేర్ చేసుకున్నారు. ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. తన సోదరుడి పెళ్లి వేడుక ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నానని చెప్పారు.
‘నా సోదరుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుక ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను. చిన్న పిల్లలా నవ్వేశాను. ఆనంద బాష్పాలు వచ్చేశాయి’ అంటూ రాసుకొచ్చారు. ఈ మేరకు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ.. తన వదినను కుటుంబంలోకి ఆహ్వానించారు. ఈ మేరకు పెళ్లికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.