Pooja Hegde | పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరియర్లో మొదటగా మోడల్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2010 లో విశ్వసుందరి పోటీల్లో ఎంట్రీ కోసం భారత్‌లో నిర్వహించిన అందాల పోటీల్లో రెండోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత తమిళ సినిమా ‘ముగమూడి’తో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘ముకుంద’తో తెలుగు తెరకు పరిచయమైంది. కొద్దిరోజుల్లోనే అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. పూజా హెగ్డే ఇండస్ట్రీలో లింగ వివక్షపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సినిమా అనేది సమష్టి కృషి అని, అందులో ప్రతి ఒక్కరికీ భాగం ఉంటుందని పేర్కొంది. సినిమా సెట్లోనూ హీరోయిన్లు లింగ వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. కొన్నిసార్లు పోస్టర్లపై సైతం క్రెడిట్ ఇవ్వరు అంటూ వ్యాఖ్యానించింది. ఇండస్ట్రీలో లింగ వివక్ష, బడా స్టార్ హీరోలతో పని చేయడంపై తన అనుభవాలను బయటపెట్టింది. అలాగే, నటీనటులతో పని చేసే సమయంలో ఎదురయ్యే సమస్యలపై సైతం స్పందించింది.
Pooja Hegde
అన్ని పరిశ్రమల్లోనూ లింగ వివక్ష ఉంటుటుందని.. ఒక్కోచోట ఒక్కోరకంగా ఉంటుందని పేర్కొంది. పరిస్థితులను బట్టి.. స్థాయిని బట్టి మారుపోతుంటుందని పేర్కొంది. ఉదాహరణకు హీరో వ్యానిటీ వ్యాన్ మూవీ షూటింగ్ జరిగే సెట్ ను పక్కనే ఉంటుందని.. మిగతా వారికి దూరంగా ఉంటాయని పేర్కొంది. హీరోయిన్లు బరువైన క్యాస్టూమ్స్, పెద్ద పెద్ద లెహంగాలు ధరించి సెట్ వరకు నడుచుకుంటూ రావాల్సి ఉంటుందని.. కొన్నిసార్లు చూసేందుకు బాగున్నా.. బరువైన దుస్తులను వేసుకొని వచ్చి.. షాట్ అయ్యాక దూరం అలాగే వెళ్లడం కూడా అదో రకమైన వివక్ష అని వాపోయింది. లింగ వివక్ష సంక్లిష్టమైందని.. సినిమా పోస్టర్లోనూ పేరు ఉండకపోవచ్చని చెప్పింది. కొన్నిసార్లు ప్రేమకథ అయినా క్రెడిట్ ఇవ్వరని చెప్పింది. సినిమా అనేది సమష్టి కృషి అని అందరూ గుర్తించాలని కోరింది.
Pooja Hegde
దశాబ్దాలుగా పని చేస్తున్న స్టార్‌తో కలిసి పని చేసినట్లు చెప్పింది. సల్మాన్ ఖాన్, ప్రభాస్ బడా స్టార్ హీరోలతో కలిసి నటించానని.. వారి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పింది. బాలీవుడ్ నటి అనుష్క శర్మ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెకు ఇండస్ట్రీలో ఎవరూ గాడ్‌ఫాదర్ ఎవరూ లేరని.. ఆమె అంటే తనకు ఎంతో ఇష్టమన్న పూజ.. ఆమె తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని తెలిపింది. తాను స్టార్ హోటల్లో గదులు, సమీపంలోని వ్యానిటీ వ్యాన్లు వంటి చిన్న చిన్న విషయాల కోసం పోరాడనని చెప్పింది. భావోద్వేగ సన్నివేశాల కోసం సహనటుడు సెట్లో ఉండేలా తాను పోరాడాలనుకుంటున్నానని.. ఎందుకంటే తరచుగా.. వారి స్థానంలో బాడీ డబుల్స్ మోహరిస్తారన్నారు. వర్క్ క్వారిటీని ప్రభావితం చేసే అంశాలపై పోరాడాలనుకుంటున్నానని చెప్పింది. ఈ సందర్భంగా హీరోలు సూర్యా, విజయ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించింది. పూజా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పూజా హెగ్డే ప్రస్తుతం తమిళంలో జననాయగన్, కాంచన-4తో పాటు హిందీలో హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీలో నటిస్తున్నది.