Pooja Hegde | రెండేళ్ల ముందు వరకు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అంటే టక్కున వినిపించే పేరు పూజా హెగ్డే. ఆమె సినిమా చేసిందంటే కోట్లు కొల్లగొట్టడం ఖాయం అనే మాట కూడా అప్పట్లో వినిపించింది. స్టార్ హీరోలు సైతం ఏరి కోరి పూజానే కావాలన్నారంటే ఆమె ఎంత లక్కీ చార్మో అర్థం చేసుకోవచ్చు. అయితే అదంతా రెండేళ్ల కిందటి ముచ్చట. గత రెండేళ్లుగా పూజా సినీ కెరీర్ చూసుకుంటే ఒక్క హిట్ కూడా లేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తర్వాత పూజా నటించిన 6 సినిమాలు పెవీలియన్ బాట పట్టాయి. సౌత్‌లో ఫ్లాపులు పలకరిస్తున్నాయని నార్త్‌కు వెళ్తే.. నార్త్‌లో కూడా ఇదే పరిస్థితి.
గంపెడంతో ఆశలు పెట్టుకున్న ‘సర్కస్’ తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ఘోరంగా ఫ్లాప్ అయింది.ఇక ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సైతం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే వరుస డిజాస్టర్లు పలకరిస్తున్నా పూజాకు మాత్రం అవకాశాలు కూడా బానే వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలుండగా.. లేటెస్ట్గా బాలీవుడ్లో మరో ఆఫర్ పట్టేసింది ఈ బ్యూటీ. షాహిద్ కపూర్ హీరోగా చేయబోయే నెక్స్ట్ సినిమాలో పూజాను హీరోయిన్గా ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాను మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్నాయి. మలయాళంలో ఆయన సినిమాలకు తిరుగులేదు. మోహన్‌లాల్, దుల్కర్, పృథ్విరాజ్ వంటి హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలిచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతుందట.
. @ZeeStudios_ & #RoyKapurFilms
make a special announcement on @hegdepooja’s birthday: She's set to star alongside @shahidkapoor
in #RosshanAndrrews ' upcoming action thriller.
.#PoojaHegde @shariqpatel #SiddharthRoyKapur @ZeeStudios_ #RoyKapurFilms pic.twitter.com/TahZ0KUdBC— Ramesh Bala (@rameshlaus) October 13, 2023