అగ్ర కథానాయిక పూజాహెగ్డే కొంతకాలం పాటు తెలుగు సినిమాకు దూరంగా ఉంది. బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఈ సొగసరి అక్కడ వరుస ఫ్లాపులు పలకరించడంతో మళ్లీ దక్షిణాది బాట పట్టింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు తొలిసారి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో జోడీ కట్టబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే… బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఓజీ’కి ఇటీవలే సీక్వెల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శకుడు సుజీత్ ప్రస్తుతం సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
మరోవైపు కథానాయిక అన్వేషణలో కూడా చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. ఈ రేసులో పూజాహెగ్డే పేరు ప్రముఖంగా వినిపిస్తున్నదని, ఆమెనే ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో దుల్కర్ సల్మాన్ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. శర్వానంద్ ‘జార్జ్‌క్రిష్’ చిత్రంలో కూడా ఆమెనే కథానాయికగా ఖరారయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.