Pooja Hegde | ఈ మధ్య అవకాశాలు తగ్గి ఫొటోషూట్లకే పరిమితమైన బుట్టబొమ్మ పూజాహెగ్డే.. ఎట్టకేలకు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ అగ్రనటుడు సూర్య కథానాయకుడిగా రూపొందుతోన్న ‘సూర్య 44’ చిత్రంలో కథానాయికగా పూజాహెగ్డేని ఎంపిక చేశారు. తమిళంలో ఇప్పటికే ఆమె మూగముడి, బీస్ట్ సినిమాలు చేసింది. ఇది పూజా నటిస్తున్న మూడో తమిళ సినిమా కావడం విశేషం. పైగా ఇది టాప్‌హీరో సూర్య సినిమా కావడంతో పూజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
‘సూర్య నా ఫేవరెట్ హీరో. ఎట్టకేలకు ఆయనతో నటించబోతున్నా. నా ఎదురుచూపులు ఫలించాయి. ఇందులో నాది అద్భుతమైన పాత్ర’ అంటూ పోస్ట్ చేసింది పూజాహెగ్డే. జూన్ మొదటివారం అండమాన్ దీవుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మలయాళం నటుడు జోజు జార్జ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిల్మ్‌తో కలిసి సూర్య 2డి ఎంటర్టైన్మెంట్స్ భారీగా నిర్మిస్తున్నది. సంతోష్‌నారాయణ్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.