మంగళూరు సోయగం పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. లాక్డౌన్ విరామం తర్వాత ఆమె తిరిగి షూటింగ్స్‌కు ఉత్సాహంగా హాజరవుతోంది. ఇటీవలే తెలుగులో ప్రభాస్‌తో కలిసి ‘రాధేశ్యామ్’ చిత్రీకరణలో పాలుపంచుకుంది. తమిళ అగ్ర హీరో విజయ్ నటిస్తున్న ‘బీస్ట్’ సినిమాలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను జూలై 1నుంచి పునఃప్రారంభించబోతున్నారు. ఇటీవలే చెన్నైలో ఓ భారీ మాల్సెట్ను తీర్చిదిద్దారు. ఇందులో విజయ్, పూజాహెగ్డేలపై ఓ హుషారైన మాస్ గీతాన్ని తెరకెక్కించబోతున్నారట. దీనికోసం పూజాహెగ్డే ప్రత్యేకంగా డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. తాను నృత్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తొమ్మిదేళ్ల విరామం తర్వాత తమిళంలో నటిస్తున్న ఈ సినిమా తన కెరీర్‌కు ఊపు నిస్తుందనే విశ్వాసంతో ఉంది పూజాహెగ్డే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో విజయ్ 65వ చిత్రంగా ‘బీస్ట్’ను తెరకెక్కిస్తున్నారు. తమిళనాట ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.