సినిమా చూసి బాధల్ని మరచిపోండి!

‘దర్శకత్వ విభాగంలో మహిళలు చాలా తక్కువగా ఉంటారు. అద్భుతమైన ప్రేమకథాంశంతో లక్ష్మీసౌజన్య ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ సినిమా చూసి మీ బాధల్ని మరచిపోండి. సితార ఎంటర్టైన్మెంట్స్ను నా ఫ్యామిలీ బ్యానర్‌లా భావిస్తా. కథానాయికను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ వేడుకకు నన్ను అతిథిగా పిలవడం చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పింది అగ్ర కథానాయిక పూజాహెగ్డే. శనివారం జరిగిన ‘వరుడు కావలెను’ చిత్ర సంగీత్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా లక్ష్మీసౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 29న ప్రేక్షకులముందుకురానుంది. నాగశౌర్య మాట్లాడుతూ “మన కుటుంబం మంచిది’ అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో ఈ సినిమా గురించి అలాగే చెప్పుకుంటాం. సినిమా బాగుందని తెలిసి ఎన్నో ఓటీటీ ఆఫర్లొచ్చాయి. అయినా థియేటర్ రిలీజ్ కోసమే ఎదురుచూశాం. దర్శకురాలు లక్ష్మీసౌజన్య ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. ఆమె శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది’ అన్నారు. ‘చక్కటి కుటుంబ అనుబంధాలు, కథాబలం ఉన్న చిత్రాలకే మా సంస్థ ప్రాధాన్యతనిస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యువతను ఆకట్టుకునే చిత్రమిది’ అని నిర్మాత నాగవంశీ తెలిపారు. రీతూవర్మ మాట్లాడుతూ ‘ఈ కథ నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రేమ, కుటుంబ బంధాల నేపథ్యంలో అందంగా సాగే కథ ఇది’ అని చెప్పింది. కథానుగుణంగా అద్భుతమైన పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు విశాల్‌చంద్రశేఖర్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

