Poo Ramu Died | కోలీవుడ్ ప్రముఖ నటుడు రామురోజ్ కన్నుమూశాడు. శుక్రవారం గుండెపోటు రావడంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పటి నుండి చికిత్స పొందుతూ ఉన్నారు. కాగా సోమవారం తుదిశ్వాస విడిచాడు. 2008లో వచ్చిన ‘పూ’ సినిమాతో ఈయనకు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఇండస్ట్రీలో ఈయనను ‘పూ’ రాము అంటూ పిలుస్తున్నారు. ‘నీర్పరవై’, ‘పరియేరుమ్ పెరుమాల్’, ‘నీడునాల్వాడై’, ‘సూరరై పొట్రూ’ వంటి సినిమాలో కోలీవుడ్లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సూర్య తండ్రిగా మంచి నటనను కనబరిచాడు. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలకు సైన్ కూడా చేశాడట. ఇక ఈయన మరణవార్త విన్న సీ.ఎం స్టాలిన్.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ స్ట్రీట్ అర్టిస్టు నుండి గొప్ప నటుడిగా ఎదికి రామురోజ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు అంటూ వెల్లడించాడు. ఉదయనిధి స్టాలిన్ హాస్పిటల్కు వెళ్ళి నివాళులు అర్పించాడు. రాము అంత్యక్రియలు ఉరపక్కంలోని తన నివాసంలో మంగళవారం జరుగనున్నాయి. మరణ వార్త విన్న పలువురు కోలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు.