Ustaad Bhagat Singh Movie | రిజల్ట్ ఎలా ఉన్నా బ్రో సినిమా మాత్రం గత వారం రోజులుగా ఏపీలో హాట్ టాపిక్‌గా నిలిచింది. అంబటి రాంబాబు ఈ సినిమా గురించి మాట్లాడని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. వెటకారంగా ఆయన డ్యాన్స్ సీన్ పెట్టారని అంబటి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓ వైపు జన సైనికులు వీర లెవల్లో అంబటి ట్రోల్ చేస్తుంటే.. మరో వైపు ఆయన ఈ విషయంలో ఇంచు కూడా తగ్గడం లేదు. ఎక్కడిదాకైనా వెళ్తా అనే విధంగా పట్టు పట్టుకుని కూర్చున్నాడు. ఇక ఆయన భాగోతం ఒకవైపు అయితే మరోటి ఈ సినిమాలో డైలాగ్స్. ఈ సినిమాలోని డైలాగ్స్ చాలా మట్టుకు ఏపీ పాలిటిక్స్‌పై సెటైర్లు వేసేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. అవి ఎక్కువగా లేకపోయినా.. ఉన్న రెండు, మూడు డైలాగ్స్ ఏపీ ప్రజలపై ప్రభావితం చేసేలా ఉన్నాయని అన్నారు.
అయితే బ్రో సినిమా కేవలం శాంపిల్ మాత్రమే అని.. హరీష్ శంకర్‌తో చేయబోయే ఉస్తాద్ భగత్‌సింగ్‌లో సెటైర్ల సునామీ ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. పైగా హరీష్ కళానికి పదునెక్కువ. ఆయన డైలాగ్స్ చెంప మీద చెల్లుమని కొట్టినట్లు ఉంటాయి. అంతేకాకుండా ఆయన రైటింగ్ నుంచి వచ్చిన చాలా డైలాగ్స్ వివాదాలకు కూడా దారి తీశాయి. ఇక ఇప్పుడు పాలిటిక్స్‌పై ఓ రేంజ్లో సెటైర్లను ప్లాన్ చేస్తున్నాడట. మాస్ పంచులు, సర్కాస్టిక్ సంభాషణలకు ఈ సినిమలో కొదవ ఉండదని సమాచారం. ఇక మొన్నటి వరకు గట్టు చప్పుడు లేని ఉస్తాద్.. ఇటీవలే ట్విట్టర్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓజీతో పాటు ఉస్తాద్‌ను కూడా పవన్ తొందరగానే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాకుండా వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని హరీష్ శంకర్‌కు చెప్పాడట.
మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నట్లు టాక్. ఇప్టపికే రిలీజైన గ్లింప్స్ వీర లెవల్లో అంచనాలు పెంచేసింది.