Boyapati Srinu| తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. అందులో ఈ జనరేషన్ బాగా గుర్తు పెట్టుకునే కాంబినేషన్ బాలకృష్ణ, బోయపాటి. ఇద్దరు కలుస్తున్నారంటే బాక్సాఫీస్ కు పూనకం వస్తుంది. గత పుష్కర కాలంలో ఇద్దరు కలిసి చేసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. పైగా బాలకృష్ణ ఎప్పుడు ఫ్లాపుల్లో ఉన్న బోయపాటితో సినిమా చేసి బయట పడిపోతుంటాడు. గతేడాది కూడా ఈ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా అఖండమైన విజయం సాధించింది. ఓ వైపు కరోనా విలయ తాండవం చేస్తున్న కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూలు కట్టారు.
ప్రస్తుతం ఈయన రామ్ పోతినేని హీరోగా సినిమా చేస్తున్నాడు. మరోవైపు బాలకృష్ణ కూడా గోపీచంద్ మలినేనితో పాటు అనిల్ రావిపూడితో సినిమాలకు కమిట్ అయ్యాడు. అక్కడ రామ్ సినిమా పూర్తి అవడానికి బోయపాటికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఎందుకంటే అది పాన్ ఇండియా సినిమా. దసరా సందర్భంగా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. మరోవైపు నవంబర్ వరకు గోపీచంద్ మలినేని ఆ తర్వాత అనిల్ సినిమాలు చేయనున్నాడు బాలయ్య. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ఈయన ఫ్రీ కానున్నాడు.
ఇదిలా ఉంటే 2023 సెప్టెంబర్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో నాలుగో సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఈసారి అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామా (political action entertainer) చేయాలని వాళ్లు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా కారణం కూడా లేకపోలేదు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బాలయ్య, బోయపాటి సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి పనికొచ్చేలా ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ సినిమా చేయాలని బాలయ్య భావిస్తున్నాడు. దానికి బోయపాటి అయితేనే పర్ఫెక్ట్ అని బాలకృష్ణ గట్టిగా భావిస్తున్నాడు. అందుకే ఇద్దరి కాంబినేషన్లో నాలుగో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అభిమానులు. సింహా, లెజెండ్, అఖండ.. వీటిని మించి ఆ వచ్చే నాలుగో సినిమా ఉంటుందేమో చూడాలి.