అఖిల్ సన్నీ, అజయ్‌ఘోష్, సంజయ్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లి జనార్ధన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. దర్శకుడు మాట్లాడుతూ ‘మన పిల్లల మీద ప్రదర్శించే ప్రేమలో కొంతనైనా అనాథ బాలల పట్ల ప్రదర్శించాలి.
అలా చేయకపోతే వారు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో చిక్కుకొని సమాజాన్ని నాశనం చేసే నేరస్థులుగా మారతారు అనే సీరియస్ అంశాన్ని చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. సామాజిక సందేశంతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. డిసెంబర్ మొదటివారంలో షూటింగ్ పూర్తవుతుందని, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నామని నిర్మాత బెల్లి జనార్ధన్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కొండపల్లి నళినీకాంత్, సంగీతం: గజ్వేల్ వేణు, రచన-దర్శకత్వం: బాబ్జీ.