Nayanthara | కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నయన్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రాన్ని నీలేష్ కృష్ణ (Nilesh Krishna) దర్శకత్వం వహించాడు. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రాముడిని కించపరిచేలా ఉందంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది.
తాజాగా ఈ సినిమా చూసిన బీజేపీ నేత రమేశ్ సోలంకి మూవీలోని కొన్ని సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘అన్నపూరణి’ సినిమా శ్రీరాముడిని కించపరిచేలా.. లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని.. ఈ మూవీ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని రమేశ్ సోలంకి ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
I have filed complain against #AntiHinduZee and #AntiHinduNetflix
At a time when the whole world is rejoicing in anticipation of the Pran Pratishtha of Bhagwan Shri Ram Mandir, this anti-Hindu film Annapoorani has been released on Netflix, produced by Zee Studios, Naad Sstudios… pic.twitter.com/zM0drX4LMR
— Ramesh Solanki🇮🇳 (@Rajput_Ramesh) January 6, 2024
ఈ సినిమా కథలోకి వెళితే.. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నయనతార ఒక ప్రొఫెషనల్ చెఫ్‌గా మారాలనుకుంటుంది. ఈ క్రమంలో తనకు ఎదురైనా సవాళ్లు ఏంటి.. కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకుని దేశంలో బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా స్టోరీ. ఇక మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. థమన్ సంగీతం అందించాడు.