Pokiri |తెలుగు సినీ చరిత్రలో సెన్సేషన్ సృష్టించిన పోకిరి విడుదలై నేటికి 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. మహేశ్ బాబు – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 2006 ఏప్రిల్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో మహేశ్ బాబు స్టార్డమ్ మరో స్థాయికి చేరిందనే చెప్పాలి. సుమారు రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో దాదాపు రూ.70 కోట్ల గ్రాస్, రూ.40 కోట్ల షేర్ సాధించి రికార్డులు సృష్టించింది. అప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో లేని విధంగా వసూళ్లు రాబట్టి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్ర విజయానికి పెద్ద బలంగా నిలిచింది. ప్రతి పాట సూపర్ హిట్ అయి ఇప్పటికీ ప్రేక్షకుల ప్లే లిస్ట్‌లలో నిలిచిపోయాయి.
కాలం గడిచినా ‘పోకిరి’ మ్యాజిక్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల రీ-రిలీజ్ అయినప్పుడు కూడా ఈ చిత్రం మరోసారి సంచలనం సృష్టించింది. దాదాపు రూ.1.7 కోట్ల వసూళ్లు సాధించి, ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతుందని నిరూపించింది. ‘పండుగాడు’ అనే వ్యక్తి మాఫియాకి సంబంధించిన వాడిగా కనిపించడవ, ఆ తర్వాత అతను అండర్‌కవర్ పోలీస్ అధికారి అనే ట్విస్ట్ అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ స్థాయి క్లైమాక్స్ ట్విస్ట్ అప్పటి వరకు తెలుగు సినిమాల్లో అరుదు. మహేశ్ బాబు నటన, ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కథను మొదటగా పవన్ కళ్యాణ్, రవితేజలకు చెప్పినట్లు సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యంకాక, చివరకు మహేశ్ బాబు చేతికి చేరింది. అలాగే హీరోయిన్గా మొదట అయేషా టకియా, కంగనా పేర్లు వినిపించినా చివరకు ఇలియానా డి క్రూజ్ ఎంపికయ్యారు. ఈ చిత్రంలో అలీ భాయ్ పాత్రలో ప్రకాశ్ రాజ్ నటన మరో హైలైట్‌గా నిలిచింది. ఈ పాత్ర తనకు బాగా నచ్చడంతోనే ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు.ఈ సినిమా కోసం మహేశ్ బాబు పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించారు. లాంగ్ హెయిర్, చిన్న గడ్డంతో ఆయన స్టైల్ అప్పట్లో యువతలో ట్రెండ్‌గా మారింది. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా అభిమానులను ఆకట్టుకుంది.‘పోకిరి’ ప్రభావం ఇతర భాషలపై కూడా పడింది. తమిళంలో విజయ్ హీరోగా ‘పోక్కిరి’, హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘వాంటెడ్’, కన్నడలో ‘పోర్కి’, బెంగాలీలో ‘రాజోట్టో’ పేర్లతో రీమేక్ అయ్యాయి. ఆశ్చర్యకరంగా అన్ని భాషల్లోనూ ఈ కథ విజయవంతమైంది. ఈ సినిమాలోని “ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు”,
“ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” వంటి డైలాగులు ఇప్పటికీ పాపులర్.