Vijay Antony | విజయ్ ఆంటోనీ నటిస్తున్న పొయెటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘తుఫాన్’. విజయ్ మిల్టన్ దర్శకుడు. కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘వెతికా నేనే నా జాడే..’ అంటూ సాగే ఈ పాటను భాష్యశ్రీ రాయగా, హరి దఫూషియా స్వరపరిచారు.
మాష్మి నేహా ఆలపించారు. ఈ సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. శరత్‌కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ్, మేఘా ఆకాశ్, మురళీశర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: భాష్యశ్రీ.