Krishna Master Pocso Case | ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌పై పోక్సో కేసు.. బెంగళూరులో అరెస్ట్
Krishna Master Pocso Case | లైంగిక వేధింపుల ఆరోపణలు టాలీవుడ్లో కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి, అనంతరం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.
Krishna Master Pocso Case | లైంగిక వేధింపుల ఆరోపణలు టాలీవుడ్లో కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి, అనంతరం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ ఘటన తాలూకు సంఘటనలు మరవక ముందే, ఇప్పుడు మరో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కృష్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. ‘ఢీ’, ‘బీబీ జోడీ’, ‘డాన్స్ ఐకాన్’ వంటి పాపులర్ షోలతో గుర్తింపు పొందిన కోరియోగ్రాఫర్ కృష్ణ .. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో, హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద POCSO కేసు నమోదు చేశారు.
ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్నా ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కేసు నమోదు చేసిన వెంటనే కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. బెంగళూరులో అతని అన్న ఇంట్లో తలదాచుకున్నాడని గుర్తించిన పోలీసులు, అక్కడే అరెస్ట్ చేశారు. అనంతరం తెలంగాణలోని కంది జైలుకు తరలించారు.. ప్రస్తుతం కృష్ణ మాస్టర్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇది కృష్ణ మాస్టర్‌పై వచ్చిన మొదటి ఆరోపణ కాదు. గతంలోనూ ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతులు, మహిళలతో పరిచయాలు పెంచుకుని మోసం చేశాడని పలు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.
ఇటీవలే కృష్ణ మాస్టర్‌కు ఓ మహిళతో వివాహం కూడా జరిగింది. భార్యకు సంబంధించిన రూ.9.50 లక్షలు నగదు తీసుకుని పరారైనట్టు సమాచారం. ఇలా కొరియోగ్రాఫర్లపై ఇలా వరుసగా లైంగిక ఆరోపణలు రావడం సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిశ్రమలో మహిళల భద్రతపై, మైనర్ బాలికల హక్కులపై మరోసారి చర్చ మొదలైంది. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పౌరసంఘాలు, మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఈ ఘటనతో టాలీవుడ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

