శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Apr 21, 2020 , 14:28:32

పుకార్ల‌ని కొట్టి పారేసిన నిశ్శ‌బ్ధం చిత్ర బృందం

పుకార్ల‌ని కొట్టి పారేసిన నిశ్శ‌బ్ధం చిత్ర బృందం

లేడీ సూపర్ స్టార్  అనుష్క చాలా రోజులు గ్యాప్ తీసుకొని   ‘నిశ్శబ్దం’ అనే చిత్రం చేసిన సంగ‌తి తెలిసిందే . ఏప్రిల్‌లో రిలీజ్ కావ‌ల‌సిన ఈ చిత్రం లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా పడిది.  ఈ సినిమాలో స్వీటీ ఇంతవరకూ చేయనటువంటీ మూగ, చెవిటి పాత్రలో కనిపించనుంది.  హేమంత్ మధుకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన నిశ్శ‌బ్ధం సినిమా అంతా అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంది.   మాధవన్, అంజలి, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు  కీల‌క పాత్ర‌లు పోషించారు.

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన నిశ్శ‌బ్ధం చిత్రం గురించి కొద్ది రోజులుగా ప‌లు పుకార్లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన చిత్ర బృందం.. సినిమా షూటింగ్ మొద‌లైన‌ప్ప‌టి నుండి పూర్త‌య్యే వ‌ర‌కు చిత్ర బృందంలోని ప్ర‌తి ఒక్క‌రు మంచి చెడుల‌లో స‌పోర్ట్‌గా ఉన్నారు. ముఖ్యంగా అనుష్క‌. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న రూమ‌ర్స్ ని ద‌య‌చేసి ప‌ట్టించుకోవ‌ద్దు.చిత్రానికి సంబంధించిన ఏ విష‌య‌మైన అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తాం అని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.


logo