Salman Khan | అనర్థాలు ఆగాలంటే చెట్లు నాటడం ఒక్కటే మార్గం: సల్మాన్ ఖాన్
మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏదో మొక్కను నాటామా..? పని అయిపోయిందా..? అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కోరారు.
ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుందన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan). తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కి వచ్చిన సల్మాన్ ఖాన్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0’ (#GreenIndiaChallenge)లో పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. అనంతరం సెల్ఫీ దిగారు.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ..మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏదో మొక్కను నాటామా..? పని అయిపోయిందా..? అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని..ఆ పనికి ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ద్వారా బాటలు వేసారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చన్నారు. నా అభిమానులంతా విధిగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని సల్మాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
అనంతరం ఎంపీ సంతోష్ కుమార్ (Santosh Kumar J) మాట్లాడుతూ..’గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఆద్యులు మాట్లాడుతూ.. పెద్ద మనసుతో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే వచ్చి మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్ గారికి కృతజ్ఞతలు. మీరు మొక్కలు నాటడం వల్ల కోట్ల మంది అభిమానులకు స్పూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#GreenIndiaChallenge is delighted to have the Bollywood Sultan in Hyderabad. Euphoric to have the company of @BeingSalmanKhan to plant saplings. He not only accept our invitation but felt proud to be part of #GIC. This would definitely inspire millions of his fanbase to replicate pic.twitter.com/yylnOdqO2P
— Santosh Kumar J (@SantoshKumarBRS) June 22, 2022
Read Also : Chinmayi Sripada | కవల పిల్లలకు చిన్మయి శ్రీపాద వెల్కమ్..పోస్ట్‌తో గాసిప్స్ కు చెక్
Read Also : Chiru Salman party | పార్టీలో చిరు-వెంకీ-సల్మాన్ సందడి..ఇంతకీ స్పెషలేంటో..?
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్‌పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్‌లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

