రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పిఠాపురంలో’. మహేష్‌చంద్ర దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంగళవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..
నేటి సమాజంలో ఏం జరుగుతుందనే అంశాన్ని దర్శకుడు మహేష్‌చంద్ర అద్భుతంగా అవిష్కరించారని, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు తరహాలో సందేశాన్ని అందిస్తూనే అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని చెప్పారు. ముగ్గురు తండ్రులు..మూడు జంటల మధ్య నడిచే కథ ఇదని, వచ్చే నెలలో విడుదల చేస్తామని దర్శకుడు మహేష్‌చంద్ర తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సీజీ క్రిష్, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎమ్ మురళీ, దర్శకత్వం: మహేష్‌చంద్ర.