Pindam Movie | ఒకరికి ఒకరు (Okariki Okaru) ఫేమ్ శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్‌కు ఇదే మొదటి మూవీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ జీవ పిండం (Jeeva Pindam)అని సాగే పాటను భగవంత్ కేసరి దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఇక ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా.. కవి సిద్దార్థ లిరిక్స్, కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందించారు.
Star director Anil Ravipudi has launched the first song from the horror movie #Pindam.
The song titled #JeevaPindam is composed by Krishna Saurabh Surampalli and is sung by Anurag Kulkarni.
Listen to the song here – https://t.co/M69VFX763u@Yeshwan71014110 @saikirandaida… pic.twitter.com/eKNqoYaCIl
— YouWe Media (@MediaYouwe) November 9, 2023
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ మారుమూల పల్లెటురిలో ఇల్లు, అందులో ఓ కుటుంబం, వాళ్లను భయపెట్టే ఆత్మ.. దీని చుట్టే కథ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆత్మలను బంధించే మంత్రగత్తె పాత్రలో ఈశ్వరి రావు నటిస్తుండగా.. తన కుటుంబాన్ని ఆత్మ నుంచి రక్షించుకునే పాత్రలో శ్రీరామ్ కనిపించనున్నాడు. ఇక 1930 నుంచి 1990 వరకు మూడు టైమ్లైన్లలో ఈ సినిమా ఉండబోతున్నట్లు దర్శకుడు సాయికిరణ్ దైదా తెలిపాడు.
కళాహి మీడియా పతాకం (Kalahi Media Banner)పై యశ్వంత్ దగ్గుమాటి (Yashwanth Daggumaati) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి తెలిపారు. శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.