Aabeer Gulaal | పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్, భారతీయ నటి వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన అబీర్ గులాల్ (Aabeer Gulaal) చిత్రం సెప్టెంబర్ 26, 2025న ఇండియాలో విడుదల కాబోతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలు అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ధృవీకరించింది. ఈ సినిమా విడుదలకు ఇండియాలో ఎటువంటి అనుమతులు మంజూరు చేయబడలేదని PIB స్పష్టం చేసింది. వాస్తవానికి, ఈ చిత్రం మే 9, 2025న భారతదేశంలో విడుదల కావాల్సి ఉంది. అయితే, ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దీని విడుదల నిలిచిపోయింది. భారతదేశం మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 12, 2025న విడుదలైంది. అయితే ఇటీవల కొన్ని మీడియా సంస్థలలో అబీర్ గులాల్ ఇండియాలో విడుదల కాబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఖండిస్తూ.. ఈ చిత్రానికి భారత సెన్సార్ బోర్డు నుంచి ఎటువంటి క్లియరెన్స్ లభించలేదని తెలిపింది.
It is being claimed by several media outlets that the film “Aabeer Gulaal” starring Fawad Khan and Vaani Kapoor will release in Indian cinemas on September 26, 2025.#PIBFactCheck
❌ This claim is FAKE
✅ No such clearance has been granted for this film. pic.twitter.com/DQJEGzb67q
— PIB Fact Check (@PIBFactCheck) September 13, 2025