Phanindra | కుబేర చిత్రంకి పోటీగా విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకున్న చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా అనంతిక సనిల్‌కుమార్, రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. చిత్రంలో వారణాసి ఎపిసోడ్ పై ఓ విలేకరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సీన్ లో కబేళాలపై పండితులు, ముస్లింలు కలిపి రేప్ చేసినట్టుగా చూపించారని మండిపడ్డారు. కేవలం పండింతులు, బ్రాహ్మణలను టార్గెట్ చేస్తూ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినట్టుగా అనిపిస్తోందని అన్నారు.
ప్రత్యేకించి ఒక వర్గాన్ని ప్రస్తావిస్తూ అడిగిన తీరుపై దర్శకుడు ఫణీంద్ర సామాజిక మాధ్యమం వేదికగా తన వర్షెన్ తెలియజేశారు. కాశీలాంటి పవిత్ర క్షేత్రంలో ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి కబేళా కావాల్సి వచ్చిందా? రేప్ చేసే విలన్‌గా బ్రాహ్మిణ్ కావాల్సి వచ్చిందా అంటూ మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో దర్శకుడు ఫణీంద్ర వివరణ ఇచ్చారు. బ్రాహ్మణ వర్గం పట్ల నాకెప్పుడూ అమితమైన గౌరవం ఉంది. వారి నాలుకపై సరస్వతి దేవి ఎప్పుడు కొలువై ఉంటుంది. అయితే ఒక వర్గంపైనే ముద్రవేస్తూ అత్యాచారం గురించి విలేకరులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు అని అన్నారు. నేరం చేసేవారికి కులం, మతం ఉండదు. వారి విచక్షణ, స్వభావం కారణంగానే చేస్తారు. నేను ఏ ఒక్క వర్గాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయలేదు, కబేళా అనేది ఎక్కడైనా ఉండొచ్చని, దానికి అనుగుణంగానే పాత్రలను ఎంచుకున్నానని తెలిపారు.
రావణుడిని కూడా ఉదాహరణగా చూపించి..రావణుడు ఎవరు? ఆయన ఒక బ్రాహ్మణుడి కుమారుడు కదా. గొప్ప శివభక్తుడు. నుదుటిపై విభూతి ధారణ చేస్తాడు. మెడలో రుద్రాక్షలు వేస్తాడు. ఉన్నత వర్గం నుంచి వచ్చి న ఆయన వేదాలు, పురాణ గ్రంథాలను ఔపాసన పట్టి చివరకు ఏం చేశాడు?” అని ప్రశ్నించారు. మనిషి తన ప్రవర్తన, ఆలోచనా ధోరణి వల్లే నేరం చేస్తాడని, అంతేకానీ మతం, కులం కారణం కాదని, ఇది మనిషి నైజం అంటూ చెప్పుకొచ్చారు. యద్భావం తద్భవతి. మీరు ఏం చూస్తారో అదే కనపడుతుంది. మీ దృష్టి కోణాన్ని మార్చుకోండి. దయ చేసి అనవసర విషయాలను ఇందులోకి తీసుకురాకండి. నటి పంతులు అనే పదాన్ని అనకుండా ఉండాల్సింది. దీనిని విలేకరి సరిదిద్ధడంలో తప్పు లేదు. ఈ విషయాన్ని ఇక్కడితే వదిలేస్తే మంచిది అని ఫణీంద్ర తన పోస్ట్‌లో పేర్కొన్నారు.