మంచులక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ముఖ్య పాత్రల్లో నటించిన పీరియాడిక్ ప్రేమకథ ‘ఆదిపర్వం’. ఆదిత్య ఓం కీలక పాత్ర పోషించారు. సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటైర్టెన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథ ఇదని, ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా అవుతుందని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన టి.ప్రసన్నకుమార్, ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.