ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టనుంది. నటుడు శ్రీమురళి హీరోగా కన్నడంలో టి.విశ్వప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 47వ చిత్రం కావడం విశేషం. శ్రీమురళి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్, దర్శకుడు, నటీనటులు, ఇతర సిబ్బంది.. తదితర విషయాలన్నీ త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. ఇదిలావుంటే.. శ్రీమురళి హీరోగా ‘పరాక్’ పేరుతో మరో సినిమా రూపొందనుంది. బ్రాండ్ స్డూడియోస్ పతాకంపై హాలేష్ కోగుండి టీమ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మార్చిలో సినిమా సెట్స్‌కి వెళ్లనుంది. ఈ సందర్భంగా బ్రాండ్ స్టూడియోస్ టీమ్ ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో
తెలియజేస్తామని వారు చెప్పారు.