Puneeth Rajkumar | పునీత్ రాజ్‌కుమార్ మరణం తర్వాత బెంగళూరు హాస్పిటల్స్ కు జనాల తాకిడి
కన్నడ (SandalWood) పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) మరణం తర్వాత కర్ణాటక అట్టుడికిపోతోంది. పునీత్ చనిపోయిన తర్వాత బెంగళూరులోని హాస్పిటల్స్ (Bengaluru Hospitals) కు సాధారణ జనం పోటెత్తుతున్నారు.

కన్నడ (SandalWood) పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) మరణం తర్వాత కర్ణాటక అట్టుడికిపోతోంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆరోగ్యంగా కనిపించిన మనిషి..ఉన్న ఫలంగా చనిపోయాడు అని తెలిసిన తర్వాత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నిజం నిజమని ఒప్పుకోవడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పునీత్ చనిపోయిన తర్వాత బెంగళూరులోని హాస్పిటల్స్ (Bengaluru Hospitals) కు సాధారణ జనం పోటెత్తుతున్నారు. దానికి కారణం హార్ట్ చెకప్స్ (Heart checkup).. మీరు చదివింది నిజమే. ప్రస్తుతం కర్ణాటకలో చాలా మంది ప్రజలు హాస్పిటల్ వైపు పరుగులు పెడుతున్నారు.
గుండెకు సంబంధించిన టెస్ట్ చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా వెంటనే ఆసుపత్రికి వెళ్ళి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఎందుకంటే అంత ఆరోగ్యంగా ఉన్న పునీత్ రాజ్ కుమార్ ఒక్క క్షణంలో ఇలా చనిపోయాడు. ఆయన చనిపోయాడు అనే విషయం కంటే కూడా.. అలా ఎలా చనిపోయాడు అనే విషయమే అందరినీ కంగారు పెడుతుంది. ఫిట్నెస్ పై అంత జాగ్రత్తగా ఉండి..ఒక చెడు అలవాటు కూడా లేని పునీత్ ఎలాంటి అనారోగ్యం లేకుండా ఒక్కసారిగా గుండెపోటుతో మరణించడం అనేది చిన్న విషయం కాదు.

పైగా ఆయనకు ముందు కూడా ఎలాంటి గుండెకు సంబంధించిన సమస్యలు (Heart Diseases) లేవు. అలాంటి వ్యక్తికే గుండెపోటు వచ్చింది అంటే..హార్ట్ ఇష్యూ ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే గుండె సంబంధిత వ్యాధులు ఉన్న పేషెంట్స్ అందరూ ఇప్పుడు బెంగళూరులోని ప్రముఖ హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతున్నారు. చాలామంది పూర్తి ఆరోగ్య చికిత్స చేసుకొని బయటకు వస్తున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా రిస్క్ తీసుకోవడం లేదు. ఏదేమైనా పునీత్ మరణం తర్వాత కర్ణాటకలో హార్ట్ చెకప్స్ పెరిగాయనేది మాత్రం ఒప్పుకుని తీరాల్సిన నిజం.
ఇది కూడా చూడండి
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

