AMMA | పెళ్లి చూపులు సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ హౌజ్‌గా వ్యవహరించి.. తెలుగు ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ హిట్ నందించింది బిగ్ బెన్ సినిమాస్ (BIGBEN Cinemas). రాజ్‌కందుకూరి, యశ్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం వసూళ్లు వర్షం కురిపించడమే కాదు.. పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు బిగ్ బెన్ సినిమాస్ మదర్స్ డే సందర్భంగా సరికొత్త సినిమాను ప్రకటించింది.
ఈ బ్యానర్లో ప్రొడక్షన్ నంబర్ 7గా వస్తున్న చిత్రం అమ్మ (AMMA). ఎమోషనల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రానికి శ్వేత పీవీఎస్ (Swetha pvs) దర్శకత్వం వహిస్తున్నారు. అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందరమ్మలకు, వారి త్యాగాలకు అంకితమిస్తూ తెరకెక్కిస్తున్న అమ్మ కాన్సెప్ట్ పోస్టర్‌ను మీతో పంచుకోవడం ఎక్జయిటింగ్‌గా ఉంది.
బిగ్‌బెన్ సినిమాస్ నుంచి మరోవైపు డియర్ కామ్రెడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటోస్టూడియో చిత్రాలు కూడా వచ్చాయని తెలిసిందే. ఇప్పటికే తరుణ్‌భాస్కర్, భరత్ కమ్మ, కేవీ మహేంద్ర, సంజీవ్‌రెడ్డి లాంటి డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన బిగ్ బెన్ సినిమాస్.. డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్వేత పీవీఎస్ను దర్శకురాలిగా పరిచయం చేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
అమ్మ కాన్సెప్ట్ పోస్టర్..
We are excited to unveil the concept poster for our upcoming production titled #AMMA 🤩🔥
An emotional thriller dedicated to all mothers & their sacrifices❤️
Directed by @Swethapvs5
More details soon! @YashBigBen #BigBenCinemas pic.twitter.com/qK0rN31NGc
— BIGBEN Cinemas (@BigBen_Cinemas) May 12, 2024