Peddi | ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్‌లో సందడి చేసేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. క్రేజ్‌కి క్రేజ్, రెమ్యునరేషన్‌కి రెమ్యునరేషన్ వస్తుండడంతో స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్‌కి సై అంటున్నారు.సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఇపుడు స్పెషల్ సాంగ్స్ గా మారిపోయినా వాటికి డిమాండ్ ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో సినిమాల్లో ఐటెం సాంగ్స్ వుంటూనే ఉన్నాయి కానీ కాలం మారుతున్న కొద్దీ వాటి రూపు రేఖలు మారుతున్నాయి. ఒక పది ఇరవై ఏళ్ల క్రితం వరకు కూడా ఐటెం సాంగ్స్ అంటే దానికి సెపరేట్ గా కొంత మోడల్స్ అని ఐటెం గర్ల్స్ అని విదేశాల నుండి తెల్ల తోలు బ్యూటీ లని దింపే వారు
కాని ఇప్పుడలా కాదు. హీరోయిన్స్‌నే దింపేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ గా ఉన్నవారిని కూడా దర్శకులు ఐటెం భామలుగా మార్చేయడం స్టార్ట్ చేసారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో మళ్ళీ ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతుంది. ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్లో షేక్ చేసిన ఐటెం సాంగ్ పుష్ప 1లోని ఊ అంటావా మామ.. పాట. ఇందులో సమంత తన గ్లామర్‌తో అదరగొట్టింది. ఇక ఆ తర్వాత పుష్ప2 కోసం డ్యాన్స్ ఫైర్ శ్రీలీలని దింపారు. అయితే సామ్ చూపించిన గ్రేస్ అండ్ హాట్ నెస్ లో ఇంచ్ కూడా శ్రీలీల మ్యాచ్ చెయ్యలేకపోయింది అనే విమర్శలు వచ్చాయి.
కట్ చేస్తే ఇప్పుడు శ్రీలీలకి మరో స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ దక్కిందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది పె. ఇందులో ఓ మాస్ స్పెషల్ సాంగ్ కోసం రామ్ చరణ్ సరసన శ్రీలీల స్టెప్పులు వేయబోతుందట. ఇండస్ట్రీ బజ్ ప్రకారం.. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేస్తున్న ఒక ఫుల్ ఎనర్జిటిక్ మాస్ సాంగ్ కి తన స్టెప్పులతో థియేటర్ దద్దరిల్లేలా శ్రీలీల చేయనుందని అంటున్నారు. ఆ పాటలో చరణ్ స్టైల్, శ్రీలీల గ్రేస్ కలిస్తే.. థియేటర్లలో ఇక మాస్ ఎక్స్ప్రోషన్ ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాలి.