Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మాస్, యాక్షన్, విలేజ్ ఎమోషన్ల మిక్స్‌తో రాబోతున్న ఈ సినిమాలో చరణ్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. యువ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌తోనే భారీ హైప్ క్రియేట్ అయింది. సినిమా కథ ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతం, స్థానిక క్రీడలు నేపథ్యంలో సాగనుంది. అందుకే సినిమా మాస్‌కి మరింత దగ్గరవుతుందని భావిస్తున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ సీన్ల కోసం హైదరాబాద్ శివారులో వేసిన భారీ సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది.
మేకర్స్ ప్లాన్ ప్రకారం, ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు విజువల్ ట్రీట్‌గా నిలవనున్నాయి. మ్యూజిక్ దర్శకుడు ఏఆర్ రెహమాన్ చిత్రంలో ఒక స్పెషల్ ఫోక్ సాంగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మా ఊరి ప్రెసిడెంట్ అనే జానపద పాటను రీమిక్స్ చేసి ఈ పాటను సింగర్ పెంచల్ దాస్‌తో పాడించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రెహమాన్ మార్క్ ఫోక్ టచ్ ఈ పాటను మరింత వైరల్ చేయనుంది. చరణ్ అభిమానులు ఈ వార్తతో ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఈ స్పెషల్ ఫోక్ సాంగ్‌లో రామ్ చరణ్ సరసన టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల కనిపించనున్నట్లు సమాచారం. ‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీలీల, ఇప్పుడు చరణ్‌తో దుమ్మురేపనుందనే టాక్ వినిపిస్తుంది.
ఇదే నిజమైతే థియేటర్లు కచ్చితంగా ఊగిపోవడం ఖాయం. చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇందులో ఫేమస్ ఆర్టిస్ట్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ మాస్ మేనరిజం, రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు కథన శైలి, ఫోక్ రీమిక్స్… ఇవన్నీ కలిస్తే ‘పెద్ది’ సినిమా 2025లో టాలీవుడ్‌ను షేక్ చేయడం ఖాయం అని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పెద్ది సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.