Peddi |మెగా అభిమానుల కోసం ‘పెద్ది’ మూవీ టీమ్ మాంచి మాస్ ట్రీట్ అందించింది. రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో తొలి పాట ‘చికిరి’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 7న ఈ సాంగ్ విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. పాట ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అందులో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ చూసి అభిమానులు పులకరించిపోయారు.. సింపుల్ అవుట్‌ఫిట్‌లో, షర్ట్, ప్యాంట్, మెడలో కర్చీఫ్ కట్టుకొని కొండ అంచున నిలబడి వేసిన స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
‘చికిరి… చికిరి…’ ట్యూన్ కంటే ఆ హుక్ స్టెప్‌లో చరణ్ చూపిన గ్రేస్, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిమానులు “బాసూ… చరణ్ డ్యాన్సులో ఏంటి ఆ గ్రేస్!” అంటూ సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌లో రియాక్షన్లు ఇస్తున్నారు. ఈ స్టెప్‌ను చూసిన అభిమానులు ఊహాశక్తిని ఉపయోగించి, ఏఐ టెక్నాలజీ ద్వారా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే హుక్ స్టెప్ వేస్తున్నట్లుగా ఒక వీడియో సృష్టించారు. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇక సినిమా విషయానికి వస్తే..రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
సినిమాకు సంగీతం అందిస్తున్నది ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్. ఇందులో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘పెద్ది’ చిత్రం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘చికిరి’ సాంగ్ రాబోతుండటంతో సోషల్ మీడియా ఇప్పటికే హీటెక్కింది చరణ్ మాస్ డ్యాన్స్ మళ్లీ రికార్డులు సృష్టించేలా ఉందనే అంచనాలు ఉన్నాయి!
Perfect 😂❤️#ChikiriChikiripic.twitter.com/lO64GCcGcV
— Asif (@DargaAsif) November 5, 2025