Peddi | రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలలో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. అయితే ఈ మూవీని వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇటీవల మూవీ నుండి గ్లింప్స్ విడుదల కాగా, ఇందులో రామ్ చరణ్ క్రికెట్ షాట్ అయితే ఓ రేంజ్లో ఉంది. పెద్ది సినిమాను బుచ్చిబాబు ఏ స్థాయిలో ఊహించుకున్నాడో.. అతని విజన్ ఏంటో ఒక్క ఫస్ట్ షాట్‌తోనే అర్థమైపోయింది. గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత నుండి ఆ షాట్‌ని చాలా మంది అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న టోర్నమెంట్స్లోనే కాక ఇప్పుడు ఐపీఎల్ జట్టు డీసీ తమ ప్రమోషన్లో కూడా వాడుకోవడం విశేషం.
మరికొద్ది గంటలలో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో డీసీ టీమ్ ఓ వీడియో విడుదల చేయగా, ఇది ఎంతగానో ఆకట్టుకుంది. ‘పెద్ది’ సినిమా గ్లింప్స్ ఆడియోతో ఈ వీడియోను ఎడిట్ చేయగా, ఇందులో రామ్‌చరణ్ కొట్టిన షాట్‌ను ఢిల్లీ ఆటగాడు సమీర్ రిజ్వీ రీక్రియేట్ చేసి చూపించాడు. దీన్ని ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా… పెద్ది టీమ్ రీట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వీడియో అయితే నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ రోజు జరిగే మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చాలా కీలకం. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిందే. ఓడితే మాత్రం ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎస్ఆర్హెచ్ తప్పుకున్నట్టే. పది మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు మూడింట మాత్రమే గెలిచింది. మిగతా నాలుగు మ్యాచ్‌లు ఉండగా, వాటన్నింటిలో భారీ మార్చిన్తో గెలవాల్సి ఉంది. ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ బీజీఎం పెద్ద అస్సెట్‌లా ఉండబోతోంది. ఇక రత్నవేలు విజువల్స్ కిరాక్ అనిపించేలా ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అంటున్నారు.
Bas ek hi kaam hai – fight for Dilli 🔥👊 pic.twitter.com/KwwpumhE5y
— Delhi Capitals (@DelhiCapitals) May 5, 2025