రామ్‌చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ ఫస్ట్ గ్లింప్స్‌తోనే సినీ ప్రేమికుల్లో ఆసక్తినిరేకెత్తించింది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ మేకోవర్, ఆయన రగ్గ్డ్ లుక్స్ అభిమానుల్ని సర్ప్రైజ్ చేశాయి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. తాజా షెడ్యూల్ కోసం చిత్రబృందం శ్రీలంకకు పయనమైంది.
అక్కడ ఓ పాటతో పాటు కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఆటకూలీగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన జాన్వీకపూర్ సందడి చేయనుంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణం: వృద్ధి సినిమాస్, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.