Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఉప్పెన’ తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సానా, ఈసారి రామ్ చరణ్ మాస్ ఎనర్జీని ఉపయోగించుకొని బడా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్ విడుదల కాగా, ఇది ఎలాంటి వైబ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ క్రికెట్ షాట్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేసిందనే చెప్పాలి.
తాజా సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. 2026 మార్చి రిలీజ్‌కు ప్లాన్ చేసినప్పటికీ, బుచ్చిబాబు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదు. షూటింగ్ త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈ నెలలో ఢిల్లీలో కీలక షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాదాపు 12-14 రోజుల పాటు రామ్ చరణ్- జాన్వీ కపూర్ కాంబోలో కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత రెండు షెడ్యూల్లలో మిగతా షూటింగ్ పూర్తి చేయనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ నాటికి సినిమా పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక వేళ ఆలస్యం అయితే, నవంబర్ లోపు ఖచ్చితంగా ఫినిష్ చేసే లక్ష్యంగా యూనిట్ ముందుకెళ్తోంది.
ఫిబ్రవరి నుంచి ప్రమోషన్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్‌గా తెలుస్తుంది. మరోవైపు సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టేందుకు గాను దర్శకుడికి చాలా సమయం ఉంటుంది.ఈ క్రమంలో పెద్ది సినిమా కచ్చితంగా బ్లాస్ బస్టర్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక భారీ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ ట్యూన్ కంపోజ్ చేసిన ఈ పాట పుష్ప 2 లోని ‘కిస్సిక్’ ని మించి ఉంటుందని అంటున్నారు. బుచ్చిబాబు తన మొదటి సినిమా ‘ఉప్పెన’లో ఐటెం సాంగ్ ప్లాన్ చేయలేదు, కానీ ఈసారి మాత్రం సినిమాకు మాస్ అప్పీల్ ఇవ్వాలన్న లక్ష్యంతో ఓ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ను ఐటెం సాంగ్ కోసం తీసుకోవాలని ఫిక్సయ్యారట. ప్రస్తుతం ఆ హీరోయిన్ ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.