Peddi | గేమ్ ఛేంజర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతుంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్ లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ప్రయత్నించని సాహసేపేతమైన యాక్షన్ సన్నివేశాలని ప్రత్యేకంగా వేసిన రైలు సెట్లో చిత్రీకరించనున్నారట. ఈ హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ నవకాంత్ మాస్టర్ సారధ్యంలో రూపొందనున్నట్టు సమాచారం.
ఈ నెల 19వరకు ఆ సెట్లోనే సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేంద్రూ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు .ఈ సినిమా కోసం ప్రత్యేకమైన లుక్‌లో కనిపిస్తున్నారు, ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోనుంది. పొడవాటి జుట్టు, ముదురు గడ్డం, ముక్కుపుడకతో పక్కా రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించబోతున్నారు. చిత్రం 2026 మార్చి 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం రామ్ చరణ్ యొక్క 41వ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది .
గేమ్ ఛేంజర్ సినిమా చేసిన గాయం నుంచి ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆ మధ్య రిలీజైన పెద్ది గ్లింప్స్.. ఆడియెన్స్‌లో సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. అసలు ఫస్ట్ షాట్ రిలీజైన తర్వాత చెర్రీ ఫ్యాన్స్ ఆనందం అవధులు దాటింది. పెద్ది సినిమా కోసం తెగ ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం అభిమానుల అంచనాలని మించి ఉంటుందని అర్ధమవుతుంది. మరోవైపు చరణ్ కూడా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు.