Seetha Payanam | యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) డైరెక్ట్ చేస్తున్న సినిమా సీతా పయనం (Seetha Payanam). కన్నడ యాక్టర్ నిరంజన్ సుధీంద్ర లీడ్ రోల్లో నటిస్తుండగా.. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటిస్తోంది.
అర్జున్ హోం ప్రొడక్షన్ బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్పై నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే అసలు సినిమా ట్రాక్‌ను విడుదల చేయగా..మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. తాజాగా పయనమే ట్రాక్‌ను రిలీజ్ చేశారు. హే యా పయనమే సాగే ఈ పయనమే.. చేరే ఏ గమ్యమే పయనమే పయనమే అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. రొమాంటిక్ మెలొడీ ట్రాక్‌ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా.. సత్య ప్రకాశ్, అనూప్ రూబెన్స్ పాడారు.
ఈ మూవీలో అర్జున్ కీ రోల్లో కూడా కనిపించనున్నాడు. కన్నడ యాక్టర్ ధ్రువ్ సార్జా కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో నిరంజన్, ప్రకాశ్ రాజ్, కోవై సరళ, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనుండగా.. వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.
హే యా పయనమే సాగే ఈ పయనమే
చేరే ఏ గమ్యమే పయనమే పయనమే #Payaname from #SeethaPayanam is a beaitiful melody by Anup Rubens. The lyrics and picturisation beautifully capture life’s journey, and Aishwarya Arjun & Niranjan make a great pair in this soulful song.Full Lyrical Song Out… pic.twitter.com/788eVHVvSV
— BA Raju’s Team (@baraju_SuperHit) January 29, 2026
పయనమే సాంగ్..