Payal Rajput | ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వడం అంత ఆషా మాషీ కాదు. అయితే కొందరు మాత్రం ఓవర్‌నైట్ స్టార్స్‌గా మారుతున్నారు. ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ పొందుతున్నారు. అలాంటి వారిలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఈ అమ్మడు ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇందులో నెగెటివ్ పాత్ర పోషించి అందరి మన్ననలు పొందింది. పాయల్ నటించిన తొలి చిత్రం హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. అయితే హిట్స్ ప్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ మధ్య మంగళవారం అనే సినిమాతో మరో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది.
పాయల సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కంటి సమస్యతో బాధపడుతున్నట్టుగా చెప్పుకొచ్చింది. తన కంటికి ఏమీ కూడా సరిగ్గా కనిపించడం లేదట. అలా హెల్త్ బాగా లేకపోయినా కూడా ఇచ్చిన కమిట్మెంట్ కోసం ఓపెనింగ్ ఈవెంట్ కోసం వెళ్లిందట. తన కంటికి మాత్రం అన్నీ రెండు రెండుగా కనిపిస్తున్నాయట. అక్కడ ఎలా మేనేజ్ చేస్తానో. ఈ కళ్ల అద్దాలతో అయితే కవర్ చేశాను అంటూ పాయల్ చెప్పుకచ్చింది. ఈ అమ్మడికి ఏ సమస్య వచ్చిందో తెలియక అభిమానులు కూడా కంగారు పడుతున్నారు.
ఇక పాయల్ ప్రస్తుతం సరైన అవకాశం, సక్సెస్ కోసం చూస్తోంది. ఆర్ఎక్స్ 100 తరువాత అవకాశాలు బాగానే వచ్చిన కూడా అవన్నీ సక్సెస్ కాలేకపోయాయి. . చివరకు మంగళవారం అంటూ మళ్లీ అజయ్ భూపతి వల్లే హిట్టు దొరికింది. అలా చాలా ఏళ్లకు మళ్లీ మంగళవారం అంటూ హిట్టు కొట్టినా పాయల్ కి అవకాశాలు కరువయ్యాయి. ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి. యంగ్ హీరో కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 మూవీ ,మంగళవారం సినిమా చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఈ భామ తెలుగుతోపాటు కన్నడ, పంజాబీలో పలు చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ సైతం నిరాశే ఎదురైంది. ఇక చేసేదేమి లేక అందాల ఆరబోతతో కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది పాయల్ రాజ్ పుత్.