ఏమయ్యిందో ఏమిటో..
పాయల్‌రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్‌భూపతి దర్శకుడు. నవంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ చిత్రంలోని ‘ఏమయ్యిందో ఏమిటో..’ అనే గీతాన్ని శనివారం విడుదల చేశారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ స్వరపరచిన ఈ గీతానికి చైతన్యప్రసాద్ సాహిత్యాన్ని అందించారు.
పాయల్‌రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్‌భూపతి దర్శకుడు. నవంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ చిత్రంలోని ‘ఏమయ్యిందో ఏమిటో..’ అనే గీతాన్ని శనివారం విడుదల చేశారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ స్వరపరచిన ఈ గీతానికి చైతన్యప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. హర్షిక ఆలపించారు. అందమైన గోదావరి పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ పాటలో పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ‘దర్శకుడు అజయ్‌భూపతి తెరకెక్కించే పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
ఈ పాటకు, కథానాయిక నేపథ్యానికి చాలా సంబంధం ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి. హత్యా రహస్యాల నేపథ్యంలో కథ ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. పాయల్ రాజ్‌పుత్ పాత్ర ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌వర్మ.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్‌భూపతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

