Payal Rajput | ‘ఆర్.ఎక్స్ 100’ ‘మంగళవారం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది పాయల్ రాజ్‌పుత్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రక్షణ’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రణదీప్ ఠాకూర్ తెరకెక్కిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశమిది. పాయల్ రాజ్‌పుత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంది.
గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆమె పాత్ర సాగుతుంది. ఒక హత్యా నేరానికి సంబంధించిన పరిశోధనలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. నటిగా పాయల్ రాజ్‌పుత్‌కు కొత్త ఇమేజ్ను తీసుకొచ్చే చిత్రమిది’ అని దర్శకుడు తెలిపారు. రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్‌బాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, సంగీతం: మహతి స్వరసాగర్, నిర్మాతలు: ప్రకాష్ జోసెఫ్, రమేష్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శరద్వాఘ్రే, నిర్మాణం, దర్శకత్వం: ప్రణదీప్ ఠాకూర్.