ఆర్ఎక్స్ 100తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఇపుడు మంచు విష్ణు (Vishnu Manchu)తో ఓ తెలుగు చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ గంగరాజు ఫేం ఇషాన్ సూర్య (Eeshaan Surya) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. నెట్టింట్లో ఏదో ఒక అప్ డేట్‌ను అభిమానులు ఫాలోవర్లతో షేర్ చేసుకునే పాయల్ ఈ సారి ఓ ఫన్నీ సరదా స్టిల్‌ను అందరితో పంచుకుంది. షూటింగ్ లొకేషన్లో సరదాగా విష్ణు పక్కనే నిద్రపోయినట్టుగా కెమెరాకు ఓ ఫోజు ఇచ్చింది.
ఈ స్టిల్కు ఉదయపు షూట్స్ ఇలా ఉంటాయి…హుహ్ నేను కండ్లు తెరవలేదు..ఎందుకంటే సగం నిద్రలో.. భయంకరంగా ఉన్నానంటూ క్యాప్షన్ ఇచ్చింది. లంగావోణిలో పాయల్ రాజ్‌పుత్, స్టైలిష్ గాగుల్స్ లో విష్ణు, ఆ పక్కనే ఓ కమెడియన్ కూడా ఫొటోలో చూడొచ్చు. ఇపుడీ ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఏవీఏ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథనందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ (Sunny Leone) కీలక పాత్రలో నటిస్తోంది.
అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. కాగా భాను, నందు సంభాషణలు అందిస్తున్నారు. చోటా కే నాయుడు కెమెరా వర్క్ చేస్తున్నాడు.