Pawan Kalyan | పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల పెద్ద ప్రమాదం నుండి బయటపడిన విషయం తెలిసిందే. స్కూల్లో జరిగిన ప్రమాదంలో మార్క్ చేతులకు, కాళ్లకు చిన్నపాటి గాయాలు అయ్యాయి. అంతేకాదు దట్టమైన నల్లటి పొగ పీల్చడంతో వైద్యులు బ్రోన్కో స్కోపీ అనే ట్రీట్మెంట్ని మార్క్ శంకర్‌కి అందించినట్టు తెలుస్తోంది. అయితే పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంటి వద్దే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో పహల్గాం మృతులకు నివాళులర్పించిన పవన్ కళ్యాణ్.. తీవ్రవాదుల కాల్పుల్లో అన్యాయంగా చనిపోయిన వారి కుటుంబాల పరిస్థితిని గుర్తుకు తెచ్చుకుంటూ కాస్త ఆవేదన చెందారు. ఇక తన కుమారుడికి అగ్ని ప్రమాదం జరిగి సురక్షితంగా ఇంటికి చేరుకున్నప్పటికీ .. ఇప్పటికీ ఆ ఘటన నుంచి శంకర్ తేరుకోలేదని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. మార్క్ శంక్ర ఇప్పటికీ రాత్రి వేళ్ల నిద్రలో లేచి.. బిల్డింగ్ పైనుంచి పడిపోయినట్లు కలలు కంటున్నాడని, దానిని నయం చేసేందుకు సైక్రియాట్రిస్ట్‌తో ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రవాదుల చేతిలో కొందరు కళ్లముందే చనిపోతుంటే.. కుటుంబ సభ్యులు ఎంత భయానకంగా ఫీలయ్యారో ఊహించలేకపోతున్నానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బహుశా ఆ పీడకలలో నుంచి అనేక కుటుంబాలు బయటకు రాలేదని అలాంటి వారందరికీ తోటి వారు ధైర్యం చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ కోరారు. కాగా, రేణు దేశాయ్ తో విడాకుల అనంతరం రష్యాకు చెందిన నటి అన్నా లెజ్ నేవాని పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2013లో వీరిద్దరు పెళ్లి కాగా, కూతురు పేరు పోలేనా అంజనా పవనోవిచ్ తోపాటు కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించారు.