Pawan Singh | భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్ ఎట్టకేలకు దిగివచ్చాడు. ఇటీవల లక్నోలో జరిగిన స్టేజ్ షోలో అసభ్యంగా హీరోయిన్ నడుమును తాకిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో పలువురు హీరో అనుచిత ప్రవర్తనపై సర్వత్రా మండిపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండురోజుల తర్వాత పవన్ సింగ్ మౌనం వీడాడు. హీరోయిన్ అంజలి రాఘవన్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. నటుడి అనుచిత ప్రవర్తనతో మనస్తాపానికి గురైన హీరోయిన్ అంజలి భోజ్‌పురి పరిశ్రమను వీడుతున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా పోస్ట్‌లో పవన్ సింగ్ స్పందిస్తూ.. ‘అంజలి జీ బిజీ షెడ్యూల్ కారణంగా నేను మీ లైవ్ చూడలేకపోయాను. ఈ విషయం నాకు తెలిసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. అందరం కళాకారులం కాబట్టి నాకు మీపై ఎలాంటి దురుద్దేశం లేదు. అయినప్పటికీ, నా ప్రవర్తతో మీరు బాధపడి ఉంటే దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. అయితే, హీరో పవన్ సింగ్ అంతకు ముందుకు ఓ పోస్ట్ చేశాడు. చేతులు ముడుచుకుని నిలబడి ఉన్న తన చిత్రాన్ని షేర్ చేశాడు. పోస్ట్‌తో పాటు ‘ఏక్ కహానీ హై- జిస్ తన్ లగే సో తన్, కోయి నా జానే పీర్ పరాయీ’ అని కాప్షన్ పెట్టాడు.
Pawan Singh Post
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘సైయాన్ సేవా కరే’ పాట ప్రమోషన్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ‘సైయా సేవా కరే’ పాట రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న అంజలి దగ్గరకు హీరో పవన్ సింగ్ వచ్చాడు. ఆమె అనుమతి లేకుండా ఆమె నడుమును తాకాడు. చీరపై ట్యాగ్ ఉందని, దాన్ని తీసేందుకు అలా చేశానని పవన్ చెప్పినట్లు వీడియోలో వినిపించింది. ఆ క్షణంలో అంజలి నవ్వినప్పటికీ, ఆమె ముఖంలో అసౌకర్యానికి గురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, ఈ వ్యవహారంలో అంజలిని తప్పుపడుతూ పలువురు మీమ్స్ చేయడంతో మనస్తాపానికి గురైంది.
బహిరంగంగా ఎవరో అనుమతి లేకుండా తాకితే దాన్ని ఎవరైనా ఆనందంగా స్వీకరిస్తారా? ఆ సమయంలో కొత్త చీర కావడంతో ట్యాగ్ ఉందేమోనని అనుకున్నాను. కానీ, ఆ తర్వాత ఏమీ లేదని తెలిసి కన్నీళ్లు ఆగలేదు. ఇదేందని నిలదీసేలోగానే పవన్ సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని, అందుకే భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఎవరి అనుమతి లేకుండా వారిని తాకడం ఎప్పటికీ సమంజసం కాదని.. ఇకపై తాను కుటుంబంతో కలిసి హర్యానాలోనే జీవిస్తానని చెప్పుకొచ్చింది. పలువురు అభిమానులు ఆమెకు మద్దతు ప్రకటించారు.
Anjali Raghav को शायद पता नहीं था पवन सिंह पहले लेते है, फिर काम देते है! 😂🤦♀️🥵 pic.twitter.com/IX14pWNdPi
— कामिनी यादव (@kaminiyadav92) August 30, 2025