OG | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఓజీ” (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) విడుదలకు ముందే భారీ సంచలనాలు సృష్టిస్తుంది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, తమ ఆరాధ్య నటుడి రాజకీయ పార్టీ జనసేన కు మద్దతు తెలుపుతూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. అభిమాన సంఘాలు ‘ఓజీ’ ఫస్ట్ డే టిక్కెట్లను వేలం వేసి, అందిన మొత్తాన్ని పార్టీకి విరాళంగా అందించారు. వివిధ ప్రాంతాల్లో వేలం ద్వారా సేకరించిన లక్షల రూపాయలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు కు అభిమానులు అందజేశారు. ఈ క్రమంలో, బెంగళూరుకు చెందిన అభిమానులు ఏకంగా రూ. 3.61 లక్షల రూపాయలను విరాళంగా సేకరించారు.
చెన్నై అభిమానులు రూ.1.72 లక్షలు , చిత్తూరు జిల్లా అభిమానులు రూ. 1 లక్ష ను జనసేన ఖజానాకు అందించారు. అభిమానుల ఈ అంకితభావం, రాజకీయంగా కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. నిధులను స్వీకరించిన నాగబాబు, అభిమానుల నిబద్ధతను ప్రశంసిస్తూ, “పవన్ కల్యాణ్‌పై అభిమానులకు ఉన్న అపారమైన మద్దతు ఆయన రాజకీయ ప్రస్థానానికి పెద్ద బలమవుతుంది” అని పేర్కొన్నారు. సినిమా రంగంలో పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను రాజకీయ రంగంలోనూ మద్దతుగా మలుస్తున్న అభిమానులు, తన సినిమా విడుదల వేడుకను కేవలం సెలబ్రేషన్‌గానే కాకుండా, పార్టీకి అండగా నిలిచే అవకాశంగా మలచుకున్నారు.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ‘ఓజీ’ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత రాత్రి సినిమా ప్రమోషన్లో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా లక్షలాది అభిమానుల సాక్షిగా పవన్‌కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇమ్రాన్ హష్మీతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సుజిత్‌ని త్రివిక్రమ్ పరిచయం చేశారు. తను నా అభిమాని. ‘జానీ’ సినిమా చూసి ఆ హెడ్ బ్యాండ్ నెలరోజులు కట్టుకొని తిరిగాడట. ఈ సినిమాకు నిజమైన పిల్లర్స్ ఇద్దరు. ఫస్ట్ పిల్లర్ సుజిత్. అద్భుతంగా సినిమా తీశాడు. అతని టీమ్ అంతా బ్రిలియంట్ యంగ్‌స్టర్స్. ఇలాంటి టీమ్ నాకుంటే బహుశా పాలిటిక్స్‌లోకి వచ్చేవాడ్ని కాదేమో. సుజిత్ తాలూకు డ్రీమ్‌ని రియలైజ్ చేసిన తమన్ ఈ సినిమాకు రెండో పిల్లర్. అతని మ్యూజిక్కే ఈ సినిమాకు వెన్నెముక అంటూ ప్రశంసలు కురిపించాడు.