మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కలిసి అగ్ర హీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలందించారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని ఫస్ట్‌సింగిల్ ‘మై డియర్ మార్కండేయ’ను శనివారం విడుదల చేశారు. పవన్‌కల్యాణ్, సాయిధరమ్తేజ్లపై తెరకెక్కించిన ఈ పాట ట్రెండీగా సాగింది. ‘మై డియర్ మార్కండేయా..మంచి మాట చెప్పా రాసుకో..మళ్లీ పుట్టి భూమికి రానే రావు నిజం తెలుసుకో..
పక్క దిగి నిద్రలేచే ప్రతి రోజు పండగ చేసుకో’ అంటూ లైఫ్ ఫిలాసఫీని ఆవిష్కరిస్తూ హుషారైన బీట్తో ఆకట్టుకుంది. తమన్ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. పబ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ పాటలో ఊర్వశి రౌతేలా తన అంచందాలతో అలరించింది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ వాసుదేవ్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: పి.సముద్రఖని.