Kushi Movie Re-Release | కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదూ. ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ‘ఖుషీ’ ఒకటి. అప్పటికే ఐదు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న పవన్‌కు ఈ సినిమా డబుల్ హ్యట్రిక్‌గా నిలిచింది. పవన్ డ్రెస్సింగ్ స్టైల్, హేయిర్ స్టైల్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో పవన్-భూమిక కెమిస్ట్రీకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఎస్.జే సూర్య అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక మణిశర్మ స్వర పరిచిన పాటలైతే ఇప్పటికి చెవులలో మార్మోగుతునే ఉన్నాయి. సినిమా రిలీజై 21ఏళ్ళయినా ఇప్పుడు చూసిన కొత్త ఫీల్‌ను కలిగిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రీ-రిలీజ్‌కు సిద్ధమౌవుతుంది.
ఈ సినిమా న్యూఇయర్ సందర్భంగా రీ-రిలీజ్ కానుంది. డిసెంబర్ 31న ఈ సినిమాను 4కే రిజల్యూషన్‌తో విడుదల కానుంది. ఇప్పటికే ప్రింట్‌ను కూడా రెడీ చేశారట. దీంతో పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ఖుషీ అవుతున్నారు. ఇక ఇటీవలే పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన జల్సా రీ-రిలీజ్‌కు అనూహ్య స్పందన వచ్చిన విషయం తెలిసిందే. కేవలం జల్సా రీ-రిలీజ్‌కే దాదాపు 4కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక ఇప్పుడు ఖుషీ సినిమాకు కూడా మంచి ఆదరణ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.