Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమారులతో కలిసి దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం మంగళగిరిలోని తన నివాసంకి చేరుకోగా.. ఆయనతో పాటు తన పెద్ద కుమారుడు అకీరా నందన్(Akhira Nandan), చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) ఉన్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరలవుతుంది. మరోవైపు తన నివాసం నుంచి పార్టీ ఆఫీస్‌కి వెళ్లిన పవన్ అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన అంశాలపై చర్చించారు.
అనంతరం మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు. అక్కడ జలజీవన్ మిషన్ కింద రూ. 1,290 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటన అనంతరం, మధ్యాహ్నం 1:45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి తిరిగి బయలుదేరతారని అధికార వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు. అనంతరం మార్కాపురం నియోజక వర్గం… pic.twitter.com/BVEDkIw66u
— BA Raju’s Team (@baraju_SuperHit) July 4, 2025