Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను కమిటైన సినిమాలని శరవేగంగా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసి ఇటీవల ఆ చిత్రం విడుదల కూడా చేశారు. ఇక పవన్ నటించిన మరో చిత్రం ఓజీ కూడా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీగా ఉంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఇక పవన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ కూడా సక్సెస్ ఫుల్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లు రాజకీయాల కారణంగా సినిమా షూటింగ్ లను పక్కన పెట్టిన ఆయన ఇప్పుడు వరుసగా కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో మొదలైన ఓ పాట షూటింగ్ తాజాగా ముగిసింది. ఈ షెడ్యూల్ పూర్తవడంతో సినిమాకు సంబంధించిన కీలక దశ పూర్తయినట్టైంది. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌తో దిగిన ఓ పవర్ఫుల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తుండగా, ఈ పిక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. పవన్ గెటప్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ లుక్‌కి సంబంధించిన క్రెడిట్ హరీష్ శంకర్‌కే ఇవ్వాల్సిందేనంటూ కామెంట్లు వస్తున్నాయి. అయితే మాటిస్తే ….నిలబెట్టుకోడం , మాట మీదే..నిలబడ్డం, మీరు పక్కనుంటే , కరెంటు పాకినట్టే అంటూ హరీష్ ఇచ్చిన క్యాప్షన్ మరోసారి పవన్‌పై తనకున్న అభిమానాన్ని తెలియజేసింది.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన సపోర్ట్ వలన ఈ షెడ్యూల్ త్వరగా పూర్తైందని హరీష్ శంకర్ అన్నారు. ఈ రోజుని జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. పవన్ ఎనర్జీ సినిమాకి మరింత పవర్ ఇచ్చింది. మాకు సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. ఇటీవలే హీరోయిన్ రాశీఖన్నా సెట్లో జాయిన్ అయ్యారు. మరో హీరోయిన్ శ్రీలీల పాత్ర కూడా ఇందులో కథానాయికగా నటిస్తుంది. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, త్వరలో మరో పాట విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనితో హైప్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ అవుతోంది. మరోవైపు ఇటీవల విడుదలైన ఓజీ సినిమా పాటకు వస్తున్న రెస్పాన్స్ కూడా పవన్ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి ఫెస్టివల్ సీజన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్లు, సర్‌ప్రైజ్‌ల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.