Pawan Kalyan | పవన్‌కల్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారు. అక్టోబర్ నుంచి ‘ఓజీ’ చిత్రం కోసం ఆయన డేట్లు ఇచ్చారని తెలుస్తున్నది. ఇటీవలే పవన్‌కల్యాణ్‌ని చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యను కలిశారని, ఈ సందర్భంగా ‘ఓజీ’ పూర్తి చేసేందుకు పవన్ సుముఖత వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది.
ఇదిలావుంటే.. పవన్ నటించిన తొలి జానపద చిత్రం ‘హరిహర వీరమల్లు’ కూడా సగం పైనే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమాను కూడా ‘ఓజీ’తో పాటే పూర్తి చేసేయాలనే సంకల్పంతో పవన్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి ‘ఓజీ’తో పాటు పూర్తి చేస్తారా? లేక ‘ఓజీ’ పూర్తయ్యాక వీరమల్లు మొదలుపెడతారా? అనేది తెలియాల్సివుంది. ఏదేమైనా.. ముందు ఈ రెంటింటినీ పూర్తి చేసి, వచ్చే ఏడాది ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మొదలుపెడతారట పవన్‌కల్యాణ్. పవర్‌స్టార్ ఇచ్చే డేట్స్‌ని బట్టి, తన తదుపరి చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నారట దర్శకుడు హరీశ్‌శంకర్.