Anna lezhneva | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో తృటిలో గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్ళకు స్వల్ప గాయాలు అయ్యాయి. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో పొగ ఊపిరితిత్తులలోకి పోవడం వలన అతడు కొంత ఇబ్బందికి గురయ్యాడు. అతనికి సింగపూర్ వైద్యులు మంచి వైద్యం అందించడంతో కొద్ది రోజులలోనే కోలుకున్నాడు. మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ కల్యాణ్ తన భార్య, కొడుకు, కూతురితో హైదరాబాద్‌కి వచ్చారు.
ఇక హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలకి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సుప్రభాత సేవలో కూడా పాల్గొన్నారు. తాజాగా తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి విరాళం అందించారు. తన కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద రూ.17 లక్షల విరాళం ఇచ్చారు అన్నా లేజినోవ..మార్క్ శంకర్ పేరు మీద ఈ రోజు భక్తులకు మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించింది టీటీడీ పాలక మండలి. నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి అనంతరం భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
కాగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదల కి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు ఆమె శ్రీవారికి తలనీలాల సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.