Pawan Kalyan | ‘హరిహర వీరమల్లు’ ప్రెస్మీట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సింపుల్‌గా కనిపించే పవన్ ఈ సారి మోడ్రన్ లుక్‌తో ఆకట్టుకోగా, ఆయన చేతి గడియారం ప్రత్యేకంగా అందరిని ఆకట్టుకుంది. ఈ వాచ్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ Eberhard & Co. కి చెందినదిగా గుర్తించారు. దీని ధర సుమారుగా రూ. 1,85,148. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాక, సినీ ప్రియులు కూడా ఈ గడియారంపై ఆసక్తి చూపుతున్నారు. ఇది ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇక సాయంత్రం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండగా, ఆ కార్యక్రమానికి పవన్ ఎలా హాజరు అవుతాడా అని ముచ్చటించుకుంటున్నారు.
ఇకపోతే ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ నెల చివర్లో విడుదల కానుంది. సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన లభించగా, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో ప్రమోషన్లు ఊపందుకోనున్నాయి. దర్శకుడు క్రిష్, జ్యోతి కృష్ణ కాంబోలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, 17వ శతాబ్దం నాటి మొఘల్ మరియు కుతుబ్ షాహీ పరిపాలన నేపథ్యంగా సాగనుంది. పవన్ ఈ సినిమాలో చారిత్రక యోధుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకమైన పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణి పని చేస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి మ్యూజికల్ బ్లాక్బస్టర్లకు సంగీతం అందించిన కీరవాణి, ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.
తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. పవన్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రంగా హరిహర వీరమల్లు నిలవనుంది. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం మరియు ఏ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు వాయిదాల తర్వాత రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగిస్తోంది. చిత్రంలో అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషించారు.