Pawan Kalyan | ఇటీవలే ఏపీ ఎన్నికల్లో విక్టరీ విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మారారని తెలిసిందే. ఇప్పటివరకు అభిమానుల కోసం సిల్వర్ స్క్రీన్‌పై వినోదాన్ని పంచిన పవన్ కల్యాణ్ ఇక పూర్తిస్థాయిలో ప్రజాసేవలో ముందుకెళ్లేందుకు సిద్దమయ్యారు. కాగా ఎన్నికల నేపథ్యంలో బిజీబిజీ షెడ్యూల్స్‌తో తీరిక లేకుండా గడిపిన పవన్ కల్యాణ్ ఇప్పటికే మూడు భారీ సినిమాలను లైన్లో పెట్టారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్లో ఓజీతోపాటు హరిహరవీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ షూటింగ్ చివరి దశలో ఉన్నాయి.
అయితే ఎన్నికల షెడ్యూల్ అయిపోయిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ నుంచి షూటింగ్ అప్డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పవన్ కల్యాణ్ త్వరలోనే తన నిర్మాతలను కలవబోతున్నారట. షూటింగ్ పూర్తి కావాల్సిన సినిమాల కోసం మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడని టాక్ నడుస్తోంది. పెండింగ్‌లో ఉన్న సినిమాల కోసం పవన్ కల్యాణ్ రెండు నెలలు సమయం ఇవ్వనున్నాడని టాలీవుడ్ సర్కిల్లో వార్తలు రౌండప్ చేస్తున్నాయి.
ఇదే నిజమైతే అభిమానులకు పవర్‌స్టార్ ఇక బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ అప్డేట్స్ ఇవ్వడం ఖాయమైనట్టే. ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్భగత్ సింగ్ గ్లింప్స్ నెట్టింటిని షేక్ చేస్తోంది. మరోవైను ఓజీ Hungry cheetah వీడియో గూప్‌బంప్స్ తెప్పిస్తూ వ్యూస్ పంట పండిస్తోంది. మరోవైపు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మొత్తానికి వరుస షూటింగ్స్‌తో అభిమానులకు ఊపిరాడకుండా చేసేందుకు రెడీ అవుతున్నట్టు అర్థమవుతుండగా.. ఈ వార్తను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్.