Pawan Kalyan| ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో సత్తా చాటుతున్నారు. పదేళ్ల పాటు ఎన్నో కష్టాలని చవి చూసిన పవన్ ఈ సారి ఎలక్షన్స్‌లో భారీ విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు పవన్‌కి ఉన్న బిజీ షెడ్యూల్స్ వలన ఆయనకి సినిమాలు చేసే టైం దొరకడం లేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాపై అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్టు గత నాలుగు సంవత్సరాలుగా పట్టాలెక్కడానికి అవకాశమే లేకుండా పోయింది. చూస్తుంటే ఈ కాంబినేషన్లో సినిమా రాకపోవచ్చనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది.
రామ్ తల్లూరి నిర్మాణంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందాల్సిన ఈ సినిమాకి సంబంధించి ఆరంభంలో ఒక పోస్టర్ విడుదల చేశారు.ఇది మంచి బజ్ క్రియేట్ చేసింది. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైంది, షూటింగ్ మొదలు కాబోతుంది అని అన్నారు. కాని ఇది ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG వంటి ప్రాజెక్టులతో పవన్ ఫుల్ బిజీగా ఉండగా ఇవే ఎప్పడు కంప్లీట్ చేస్తాడా అని అందరు ఆలోచనలో పడ్డారు. డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకు సమయం కేటాయించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో వేరే హీరోతోనే సురేందర్ రెడ్డి ఆ ప్రాజెక్టును కొనసాగించాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కథను ఏ మాత్రం మార్చకుండా, దానికి సూటయ్యే మరో హీరోను తీసుకుని కథను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. పవన్ కళ్యాన్ తన అభిమానుల కోసం ఎలా అయిన ఒప్పుకున్న సినిమాలని పూర్తి చేయాలని అనుకుంటున్నారు కాని బిజీ షెడ్యూల్స్ వలన కుదరడం లేదు. అందుకే కథ మీద చాలా నమ్మకం ఉన్న నిర్మాతలు పూర్తిగా ప్రాజెక్టును ఆపేయకుండా వేరే మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని ఓ నిర్ణయానికి వచ్చారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. పవన్ ఏదో ఒక రకంగా సినిమాలకు డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. కాని కమిట్మెంట్స్ ఆయనని క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుందో..!